నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ కిర్రాక్ ఆర్పీ ఎక్కడ!
on Jun 8, 2023
పంచ్ ప్రసాద్ అనగానే కిర్రాక్ ఆర్పీ పేరు వెంటనే గుర్తోచేస్తుంది. ఎందుకంటే జబర్దస్త్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాక వాటన్నిటినీ వదిలేసి "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు" పేరుతో రెస్టారెంట్ పెట్టి కొన్ని నెలల్లోనే బాగా ఫేమస్ అయ్యాడు. ఆ టైంలోనే పంచ్ ప్రసాద్ హెల్త్ కి సంబంధించి మొత్తం ఖర్చు భరిస్తాను అని చెప్పిన ఆర్పీ ఇప్పుడు ముఖం చాటేశాడు అంటున్నారు నెటిజెన్స్..దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆర్పీ ఎక్కడా కనిపించడం లేదు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కుదుటపడేవరకు అతని మొత్తం బాధ్యతలను తానే దగ్గరుండి చూసుకుంటాను అని మీడియా వేదికగా గట్టిగానే హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సర్జరీ చేయాల్సిన సమయం వచ్చింది కానీ ఆర్పీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జబర్దస్త్ టీం మొత్తం కూడా ఫండ్ రైజ్ చేసినా ఆర్పీ మాట ఎక్కడ వినిపించలేదు.
ఐతే అప్పట్లోనే పంచ్ ప్రసాద్ కి ఆరోగ్యం బాగోకపోతే నాగబాబు గారే అన్ని చేశారని, కానీ శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం చిల్లిగవ్వ ప్రసాద్ కి సాయం చెయ్యలేదు అంటూ అన్నం పెట్టిన సంస్థనే ఇంటర్వ్యూల్లో నానా మాటలూ అన్నాడు కిర్రాక్ ఆర్పీ. అంతటి గొప్ప హామీ ఇచ్చిన ఆర్పీ పంచ్ ప్రసాద్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ తెలిసినా ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటున్నారు నెటిజన్స్. సాయం చేయలేనప్పుడు సైలెంట్ గా ఉండాలి కానీ ఇలా పబ్లిసిటీ స్టెంట్ కోసం ఇలాంటి మాటలు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. మొదట కేపీహెచ్ బీలో ప్రారంభించిన నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ ను.. రెండో బ్రాంచ్ గా మణికొండలో ప్రారంభించి అమీర్ పేటలో మూడో బ్రాంచ్ ని ఓపెన్ చేసాడు ఆర్పీ. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సీనియర్ నటుడు శ్రీకాంత్ , డైరెక్టర్ మారుతీ వచ్చారు. ఇన్ని బ్రాంచెస్ పెట్టి ఇంత సంపాదిస్తున్నప్పుడు పంచ్ ప్రసాద్ కి సాయం చేయడం పెద్ద విషయమేమీ కాదు కదా అంటున్నారు. మరి ఈ కామెంట్స్ మీద కిర్రాక్ ఆర్పీ ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు రియాక్ట్ అవుతాడో లేదో వెయిట్ చేసి చూద్దాం..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
